రంగస్థలం సంబరాల్లో చరణ్ ఫ్యాన్స్

రంగస్థలం సంబరాల్లో చరణ్ ఫ్యాన్స్

రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో రంగస్థలం ఒకటి.  సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది.  చిట్టిబాబుగా చరణ్ నటన అమోఘం.  మాస్ పాత్రలో చరణ్ అలరించాడు.  1985 ప్రాంతంలో ఓ గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తెరెకెక్కింది.  ఇందులో చరణ్ పాత్రను డిజైన్ చేసిన తీరు అద్భుతమని చెప్పాలి.  

సినిమా రిలీజ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  అటు సమంత కూడా సినిమాకు ప్లస్ అయింది.  డిగ్లామరస్ రోల్ అదరగొట్టింది.  సాంగ్స్ కూడా సినిమాకు కలిసొచ్చాయి.  గతేడాది మార్చి 30 వ తేదీన సినిమా రిలీజ్ అయింది.  నేటికీ సరిగా సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం అయింది.  వన్ ఇయర్ రంగస్థలం వేడుకలను ఫ్యాన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.