ఉపాసన.. నాకు చాలా గర్వంగా ఉంది !

ఉపాసన.. నాకు చాలా గర్వంగా ఉంది !

రామ్ చరణ్ సతీమణి ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో ఎంత చురుగ్గా ఉంటారో తెలిసిన సంగతే.  ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక స్పృహ వంటి అంశాల్లో నెటిజన్లకు అమూల్యమైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు ఆమె. అందుకే ఈ యేడాదికిగానూ దాదా సాహెబ్ పాల్కే ఫిలాంత్రఫిస్ట్ అవార్డు ఆమెను వరించింది.  ఈ సందర్బంగా రామ్ చరణ్ 'ప్రియమైన ఉప్సీ.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా' అంటూ ఆప్యాయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.