బోయపాటి సినిమాకు చరణ్ సన్నద్ధం

బోయపాటి సినిమాకు చరణ్ సన్నద్ధం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇక అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకోవడానికి రేపు సాయంత్రం భారీ స్థాయిలో సక్సెస్ మీట్ నిర్వహించడానికి ప్లాన్ చేశారు. సో ఇక దింతో అఫీషియల్ గా రంగస్థలం హంగామా ముగుస్తుంది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ బోయపాటి శ్రీను చరణ్ లేని కొన్ని సన్నివేశాలను ఓ చిన్న షెడ్యూల్ వేసి ఫినిష్ చేశాడు. తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల ఆఖరు నుండి చరణ్ ఈ మూవీ సెట్స్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో చెర్రీ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. మాస్ పల్స్ కరెక్ట్ గా తెలిసిన బోయపాటితో చరణ్ సినిమా చేస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అసలే రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సినిమా అంటే ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తుండగా, తమిళ హీరో ప్రశాంత్ ఓ కీలక పాత్రలో మెరవనున్నాడు. ఈ చిత్రాన్ని దసరా నాటికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేయగా, డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందనుంది.