'రంగస్థలం' తరవాత చరణ్ రెమ్యునరేషన్ ఎంతంటే !

'రంగస్థలం' తరవాత చరణ్ రెమ్యునరేషన్ ఎంతంటే !

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యంత ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా 'రంగస్థలం'.  ఈ సినిమాతో చరణ్ స్టార్ డమ్ రెట్టింపైంది.  నటుడిగా ఆయన స్థాయి కూడ పెరిగింది.  అందుకే ఆయన తన రెన్యుమరేషన్ కూడ పెంచారట. 

గత సినిమాలకు 12 నుండి 15 కోట్ల వరకు తీసుకున్న చరణ్ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నసినిమాకి 20 కోట్ల వరకు తీసుకున్నట్టు సమాచారం.  ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు 'వినయ విధేయ రామ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.  దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ కథానాయకిగా నటిస్తోంది.