చరణ్ ఇంస్టాగ్రామ్ తొలి పోస్ట్ .. వైరల్

చరణ్ ఇంస్టాగ్రామ్ తొలి పోస్ట్ .. వైరల్

మొన్నటి వరకు కేవలం పేస్ బుక్ లో మాత్రమే చరణ్ యాక్టివ్ గా ఉండే వాడు.  కానీ, ఇప్పుడు చరణ్ కొత్తగా ఇంస్టాగ్రామ్ లోకి ప్రవేశించాడు.  సెలెబ్రిటీలంతా ఇంస్టాగ్రామ్ లో ఉండటం వలన చరణ్ కూడా ఇందులో అకౌంట్ తీసుకున్నాడు.  అకౌంట్ తీసుకున్న కొద్దిగంటల్లోనే ఐదు లక్షల మంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు.  

రెండు రోజుల క్రితం అకౌంట్ ఓపెన్ చేసిన చరణ్ ఈరోజు తన ఫస్ట్ పోస్ట్ ను పోస్ట్ చేశారు.  ఈ పోస్ట్ ఆకట్టుకుంది.  తన తల్లితో ఉన్న ఫోటోను చరణ్ పోస్ట్ చేశాడు.  నా మొదటి పోస్ట్ నీకోసమే అమ్మా అని క్యాప్షన్ ఇచ్చారు.  ఈ క్యాప్షన్ అందరిని ఆకట్టుకుంది.  చరణ్ పోస్ట్ ను దాదాపుగా 50 వేలమందికి పైగా లైక్ చేయడం విశేషం. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.  అలానే సైరా సినిమా నిర్మాతగా బిజీ అయ్యారు.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Somethings never change !! Dedicating my first post to u. Love u Amma. ❤#mamasboy #forever.

A post shared by Ram Charan (@alwaysramcharan) on