'ఉప్పెన' టీజర్ కి ఇంప్రెస్ అయిన రామ్ చరణ్

'ఉప్పెన' టీజర్ కి ఇంప్రెస్ అయిన రామ్ చరణ్

యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, మంగళూరు బ్యూటీ కృతిశెట్టిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్న చిత్రం ‘ఉప్పెన’. విడుదలకు ముందే ‘నా కన్ను నీలి సముద్రం’, ‘రంగులద్దుకున్న తెల్ల రంగులోనా’, ‘ధక్ ధక్ ధక్’ పాటలతో కుర్రకారును ‘ఉప్పెన’లో ముంచెత్తగా.. తాజాగా వచ్చిన టీజర్ యూత్ కి కనెక్ట్ అయిందనే చెప్పాలి. 'ఉప్పెన' టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. భావోద్వేగపూరితమైన మాటలు, క్లాసికల్ పాటలు, ఆకట్టుకునే విజువల్స్ అన్నీ కలిసి ప్రేక్షకులకు ఇది ఫీల్ గుడ్ మూవీ అనే అభిప్రాయాన్ని కలిగించాయి. దీంతో ఈ టీజర్ పై సెలెబ్రిటీలు కూడా ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ కూడా ఈ సినిమా టీజర్ చూసి ఇంప్రెస్ అయ్యారు. ఉప్పెన టీజర్ చాలా అందంగా ఉందని, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల ఫెయిర్ చాలా ఫ్రెష్ గా ఉందంటూ.. ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. కాగా, ఈ చిత్రంలో త‌మిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.