ఒకే నెలలో రిలీజవుతున్న చరణ్ సినిమాలు !

ఒకే నెలలో రిలీజవుతున్న చరణ్ సినిమాలు !

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజవుతున్నాయి.  అది కూడ మలయాళంలో కావడం విశేషం.  ఈ ఏడాది చరణ్ సుకుమార్ డైరెక్షన్లో చేసిన సూపర్ హిట్ సినిమా 'రంగస్థలం' ముందుగా జనవరి 18న రిలీజవుతుండగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన కొత్త చిత్రం 'వినయ విధేయ రామ' జనవరి 25న విడుదలకానుంది.  ఇలా చరణ్ వెంట వెంటనే రెండు సినిమాలతో మలయాళ ప్రేక్షకుల్ని అలరించనున్నాడు.  దీంతో మాలీవుడ్లో ఆయన మార్కెట్ స్థాయి మరింత పుంజుకోనుంది.