రామ్ చరణ్ న్యూలుక్ అదిరింది గురూ...!!

రామ్ చరణ్ న్యూలుక్ అదిరింది గురూ...!!

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇందులో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. అల్లూరి సీతారామ రాజు పాత్రను ఇతివృత్తంగా చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి.  కానీ, ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి ఎవరూ టచ్ చేయని కోణంలో సినిమా తీస్తున్నారు.  దీంతో అయన పాత్ర ఎలా ఉండబోతుంది అన్నది సస్పెన్స్ గా మారింది.  కనీసం ఈ సినిమాలోని ఎలాంటి లుక్స్ ను కూడా రాజమౌళి బయటకు రిలీజ్ చేయలేదు.  ఇదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. 

కాగా, రామ్ చరణ్ బయట కనిపిస్తున్న లుక్ టోన్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా కన్పిస్తున్నారా అన్నది తెలియాలి.  మెలి తిప్పిన మీసాలతో చరణ్ లుక్స్  సూపర్ గా ఉన్నది. ఇదిలా ఉంటె, ఈరోజు మంచు మనోజ్ హీరోగా చేస్తున్న అహం బ్రహ్మాసి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.  సినిమా ఓపెనింగ్ కు స్పెషల్ గెస్ట్ గా రామ్ చరణ్ వస్తున్నారు.  ఆ సమయంలో రామ్ చరణ్ న్యూలుక్ తో కనిపించారు.  ఈ లుక్ ప్రతి ఒక్కరిని ఎట్రాక్ట్ చేస్తున్నది.