కొరటాలతో మిస్ అవడంతో చరణ్ ఆ డైరెక్టర్ ను లైన్ లో పెడుతున్నాడా..?

కొరటాలతో మిస్ అవడంతో చరణ్ ఆ డైరెక్టర్ ను లైన్ లో పెడుతున్నాడా..?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నా ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో అని ఇప్పటికే ప్రకటించాడు. కానీ చరణ్ మాత్రం తన తర్వాతి సినిమా అనౌన్స్ చెయ్యలేదు. అయితే ఇన్ని రోజులు చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివ తో సినిమా చేస్తాడు అని వార్తజాలు జోరుగా వినిపించాయి. కానీ కొరటాల తన తర్వాత సినిమా అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసేసాడు. ఇక కొరటాలతో మిస్ అవడంతో చరణ్ మరో  డైరెక్టర్ ను లైన్ లో పెడుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. 'అర్జున్ రెడ్డి' సినిమాతో  మంచి హిట్ అందుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ  తర్వాత అర్జున్ రెడ్డిని హిందీలో 'కబీర్ సింగ్' గా రీమేక్ చేసాడు. ఈ సినిమా అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ కూడా మరో సినిమా మొదలుపెట్టలేదు. ఇక ప్రస్తుత  సమాచారం ప్రకారం చరణ్ సందీప్ తో సినిమా చేయనున్నాడట! ఎందుకంటే ఈ యువ దర్శకుడు తెలుగుతో  పాటుగా హిందీలో కూడా హిట్ కొట్టి ఉండటంతో చరణ్ సందీప్ తో కలిసి పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తుంది.