చరణ్,ఎన్టీఆర్ ఇద్దర్నీ గాయాలు వేధిస్తున్నాయి

చరణ్,ఎన్టీఆర్ ఇద్దర్నీ గాయాలు వేధిస్తున్నాయి

రాజమౌళి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణకు బ్రేక్ పడింది.  అందుకు కారణం హీరోలు చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ గాయాల బారిన పడటమే.  చరణ్ వర్కవుట్స్ చేసే సమయంలో చీలమండకు  గాయమడంతో ఇంకొద్దిరోజుల పాటు విశ్రాంతిలోనే గడపనున్నారు.  ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే తాజాగా ఆయనకు కూడా మణికట్టు బెణకడంతో వైద్యులు ఆయన్ను కూడా రెస్ట్ తీసుకోమని చెప్పారట.  దీంతో షూటింగ్ మొదలుకావడానికి ఇంకొన్ని రోజులు పడుతుందని తెలుస్తోంది.  చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు.