కొరటాలకు చరణ్ ఎంత చెల్లించాడు ?

కొరటాలకు చరణ్ ఎంత చెల్లించాడు ?

 

దర్శకుడిగా కొరటాల శివకు ఒక్క పరాజయం కూడా లేదు.  'శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను' లాంటి భారీ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి.  ఆయన నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నాడు.  ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీస్థాయి హైప్ ఉంది.  ఈ ప్రాజెక్ట్ కోసం చిరు బరువు కూడా తగ్గుతున్నాడు.  'సైరా' పనులు పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది.  ఈ చిత్రం కోసం కొరటాల భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.  నిర్మాత చరణ్ ఇప్పటికే ఆయనకు 2 కోట్ల అడ్వాన్స్ చెల్లించాడని టాక్.  ఈ చిత్రంలో చిరుకి జోడీగా నయనతార, తమన్నాలు నటించనున్నారు.