పాన్ ఇండియాకు ప్లాన్ చేస్తున్న చెర్రీ..
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియాలో రేసుకు సిద్దమవుతున్నారు. ప్రభాస్ ఇప్పటికే వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. అల్లు అర్జున్ తన నూతన సినిమా పుష్పతో పాన్ ఇండియాకు ట్రై చేస్తున్నాడు. ఎన్టీఆర్ రాజమౌళి సినిమా తరువాత త్రివిక్రమ్‌తో పాన్ ఇండియా రేంజ్ సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే చెర్రీ మాత్రం తన తదుపరి చిత్రాన్ని కూడా తెలపకుండా కామ్‌గా ఉన్నాడు. అయితే రాజమౌళి సినిమా తరువాత రీజనల్ సినిమా ప్లాన్ చేస్తే ఆ హీరోకి ముందుచూపు లేదని చెప్పుకోవచ్చు. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిందో తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రాంచరణ్ కాంబోలో ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే సినిమాను లాక్ చేశాడు. అయితే చెర్రీ కూడా సైలెంట్‌గా పాన్ ఇండియా రేంజ్ సినిమాను ప్లాన్ చేశాడట. అది కూడా జెర్సీ సినిమాతో భారీ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాతో రాంచరణ్‌తో పాటు దర్శకుడు గౌతమ్ కూడా పాన్ ఇండియా ఫ్లాట్ ఫార్మ్‌లో చేరనున్నాడు. ఈ సినిమాతో గౌతమ్‌కి బాలీవుడ్లో మంచి గుర్తింపు వస్తుందని అంచనాలు వేస్తున్నారు. అంతేకాకుండా తారక్ సినిమా తరువాత త్రివిక్రమ్ తనతో ఓ సినిమా చేయాలని చరణ్ త్రివిక్రమ్‌ను లాక్ చేశాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)