బాలయ్య బాటలో రామ్ చరణ్ కూడా..?

బాలయ్య బాటలో రామ్ చరణ్ కూడా..?

ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సినిమా పరిశ్రమకు బోలెడు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. స్టూడియోల నిర్మాణం చేపట్టేవారికి ఉచితంగా స్థలం ఇచ్చేనందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలియడంతో టాలీవుడ్ కు చెందిన కొంతమంది ప్రముఖులు వైజాగ్ లో స్టూడియోలు నిర్మించేందుకు సిద్ధమౌతున్నారు.  ఇందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ వైజాగ్ లో స్టూడియో నిర్మించేందుకు సిద్దమౌతున్నట్టు సమాచారం.  ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తరువాత స్టూడియో నిర్మాణంపై దృష్టి సారిస్తారని తెలుస్తున్నది.  

ఇదిలా ఉంటె, రామ్ చరణ్ కూడా వైజాగ్ లో ఫిల్మ్ స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.  ప్రస్తుతం రామ్ చరణ్.. బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.  భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నది.  ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మెగాస్టార్ తో సైరా వంటి చారిత్రాత్మకమైన సినిమా నిర్మిస్తూ ఫుల్ బిజీ అయ్యారు రామ్ చరణ్.  ఇప్పుడు స్టూడియో నిర్మాణం పనులు కూడా మొదలయ్యాయంటే.. చరణ్ ఇంకాస్త బిజీ అవుతారేమో.