చరణ్ ఫస్ట్ లుక్ టీజర్ ఎప్పుడంటే..!!

చరణ్ ఫస్ట్ లుక్ టీజర్ ఎప్పుడంటే..!!

రామ్ చరణ్.. బోయపాటి సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.  రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై ఇప్పటి వరకు ఓ సందేహం ఉన్నది.  దీపావళి రోజున రిలీజ్ చేస్తారని అనుకున్నారు.  దీపావళి కంటే ముందే చరణ్ సినిమా ఫస్ట్ లుక్ రాబోతున్నది.  

నవంబర్ 6 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారట. అలాగే నవంబర్ 9 వ తేదీ ఉదయం 10:25 గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.  టైటిల్ ను కూడా రేపు ప్రకటించే అవకాశం ఉన్నది.