చరణ్ చేతిలో కొత్తరకం ఆయుధం..సోషల్ మీడియాలో వైరల్

చరణ్ చేతిలో కొత్తరకం ఆయుధం..సోషల్ మీడియాలో వైరల్

రామ్ చరణ్.. బోయపాటి కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతున్నది.  అజర్ బైజాన్ షూటింగ్ ను పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన టీమ్.. వైజాగ్ లో భారీ షూట్ ను ప్లాన్ చేశారు.  వీలైనంత త్వరగా సినిమా షూట్ ను పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  

వైజాగ్ లో ప్రస్తుతం భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.  ఈ షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.  ఈ లీక్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం.  చరణ్ రఫ్ లుక్ లో, చేతిలో వింతగా ఉన్న ఆయుధాన్ని పట్టుకొని రౌడీలతో ఫైట్ చేస్తుంటాడు.  భారీ యాక్షన్ ఫైట్ గా దీనిని తీస్తున్నారట.  రామ్ చరణ్ పక్కన కియారా అద్వానీ నటిస్తున్నది.  డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.