దీపావళి నుంచి మొదలుపెట్టబోతున్న రామ్ చరణ్

దీపావళి నుంచి మొదలుపెట్టబోతున్న రామ్ చరణ్

రామ్ చరణ్ తేజ్... బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఏ ఒక్క పోస్టర్ గాని, టీజర్ గాని, టైటిల్ గాని బయటకు రాలేదు.  మొన్న దసరాకు ఏదైనా న్యూస్ వస్తుంది అనుకుంటే.. సైలెంట్ గా ఉండిపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.  బోయపాటిని ఎన్నిసార్లు ప్రశ్నించినా.. అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. 

సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ఇప్పటికే ప్రకటించారు.  ఆ డేట్ ను పోస్ట్ చేసే ఆలోచనలో బోయపాటి లేనట్టుగానే కనిపిస్తున్నది.  సమయం తక్కువగా ఉండటంతో.. ఎప్పటి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారనేదానిపై ఓ క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తున్నది.  అందుతున్న సమాచారం ప్రకారం.. దీపావళి నుంచి చరణ్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని తెలుస్తున్నది.  దీపావళి రోజున చరణ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను గాని, టైటిల్ టీజర్ ను గాని రిలీజ్ చేస్తారని సమాచారం అందుతున్నది.  వినయ విధేయ రామ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టుగా వార్తలు అందుతున్న.. అందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు.  సినిమాకు సాఫ్ట్ టైటిల్ పెడితే.. ఫ్యాన్స్ కు రీచ్ అవుతుందా అన్నది సందేహం.  ఈ సినిమాకు సంబంధించిన ఏ న్యూస్ అయిన బయటకు రావాలి అంటే దీపావళి వరకు ఆగాల్సిందేనేమో.