ఎన్టీఆర్ కంటే ముందే చరణ్ ఫస్ట్ లుక్ ఎందుకంటే... 

ఎన్టీఆర్ కంటే ముందే చరణ్ ఫస్ట్ లుక్ ఎందుకంటే... 

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  జులై 30 వ తేదీన సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన వచ్చే ఏడాది జనవరి 8కి పోస్ట్ ఫోన్ చేశారు.  దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.  కనీసం సినిమాకు సంబంధించిన ఏదైనా పోస్టర్ లేదా మరొకటి రిలీజ్ చేస్తారని అనుకున్నా అలాంటిది ఏమి లేదు.  

అయితే, ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ న్యూస్ ట్రెండ్ అవుతున్నది.  అదేమంటే, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు.  మొదటగా రామ్ చరణ్ కు సంబంధించిన అల్లూరి సీతారామరాజు పోస్టర్ ను రిలీజ్ చేస్తారని టాక్ వస్తోంది.  మార్చి 27 వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు.  ఆ రోజున ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 వ తేదీ కాబట్టి ఆరోజున ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నది.