చరణ్ సంచలన నిర్ణయం....రాజమౌళే కారణమా ?

చరణ్ సంచలన నిర్ణయం....రాజమౌళే కారణమా ?

మెగా తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం విశాఖ మన్యంలో శరవేగంగా జరుగుతుంది. చాలా సెక్యూరిటీ మధ్య రాజమౌళి అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. దీనిపై చిత్రయూనిట్‌కు కూడా క్లాస్ తీసుకున్నాడు రాజమౌళి. అయితే ఈ పరిణామాలతో విసిగిపోయిన జక్కన్న యూనిట్ అంతటికీ క్లాస్ ఇచ్చినట్టే ఇద్దరు హీరోలకి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పాడట. అందులో భాగంగానే చరణ్ ని ప్రొడక్షన్ ఆపమని చెప్పినట్టు ప్రచారం జరగుతోంది. దానికి కారణం ఏమిటంటే కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించిన చరణ్ తాజాగా సైరా సినిమాని నిర్మించారు.

ఈ సినిమా రిలీజ్ కోసమని ఎన్నో రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాకి డుమ్మా కొట్టారు. అయితే నిర్మాత ఎటూ గాట్టిగా చెప్పలేడు కాబట్టి చరణ్ తన పని తాను చేసుకుని వచ్చేవాడు. అయితే షూట్ పద్దపద్దాకా ఆగుతుండడంతో విసిగిపోయిన జక్కన్న చరణ్ కి గట్టిగానే సినిమా ప్రొడక్షన్ ఆపమని చెప్పాడట. రెండు పడవల మీద కాలు పెట్టడం సరికాదని చెప్పి అర్ధమయ్యేలా వివరించడంతో ఆయన ఈ సినిమా కోసం తన ప్రొడక్షన్ పనులు ఆపాశాడని సమాచారం. కొరటాల-చిరు కాంబినేషన్ సినిమాని కూడా ఆయన చేయడం లేదని ఆ సినిమాకి సహా భాగస్వామిగా ఉన్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అందుకుందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో అధికారిక ప్రకటన వెలువడే దాకా ఆగాల్సిందే.