జూలైలో సెట్స్ పైకి శంకర్-రాంచరణ్ సినిమా: దిల్ రాజు

జూలైలో సెట్స్ పైకి శంకర్-రాంచరణ్ సినిమా: దిల్ రాజు

సెన్సేషనల్‌ డైరెక్టర్‌‌ శంకర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబోలో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాంచరణ్ కెరీర్లో 15వ సినిమాగా రాబోతుంది. కాగా హీరోయిన్​గా కియారా అడ్వాణీ పేరు పరిశీలనలో ఉంది. ఈ చిత్ర షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమతుందోనని అభిమానులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' ముచ్చట్లతో బిజీగా ఉన్న నిర్మాత దిల్ రాజు.. శంకర్-రాంచరణ్ సినిమాపై ఓ అప్డేట్ ఇచ్చారు. జూలై నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్​పైకి వెళ్లనుందని నిర్మాత దిల్​రాజు క్లారిటీ ఇచ్చారు. జూన్​ నాటికి ప్రీ-ప్రొడక్షన్​ పనులు పూర్తి చేసుకొని జులైలో షూటింగ్ మొదలు పెడతామని దిల్ రాజు స్పష్టం చేశారు.