చరణ్ రియల్ మెగాస్టార్ ను చూశారట ..!!

చరణ్ రియల్ మెగాస్టార్ ను చూశారట ..!!

సైరా సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. అక్టోబర్ 2 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈనెల 15 వ తేదీ నుంచి ప్రమోషన్ ను షురూ చేస్తున్నారని సమాచారం.  ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే సంచలనాలు సృష్టించింది.  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఇదిలా ఉంటె, రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు.  

మెగాస్టార్ కు ఎదురుగ నిలబడి.. గడ్డాన్ని సరిచేస్తున్న ఫోటో అది.  ఆ ఫొటోకు అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు.  నిర్మాతగా మారిన తరువాత రియల్ మెగాస్టార్ ను చూశాను.  సినిమా కోసం మెగాస్టార్ అంకిత భావంతో ఎలా పనిచేస్తారో చూశాను అని చెప్పి అన్నారు రామ్ చరణ్.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మితమౌతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు.  పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ వంటి టాప్ హీరోలు నటించడం విశేషం.