రిస్కీ లొకేషన్లో రామ్ చరణ్ షూటింగ్ !

రిస్కీ లొకేషన్లో రామ్ చరణ్ షూటింగ్ !

రామ్ చరణ్ ప్రస్తుతం అజర్బైజాన్ లో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్ సైతం ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.  ప్రస్తుతం చిత్రీకరణను ఒక రిస్కీ లొకేషన్లో సెట్ చేశారు. 

ఇంతకీ ఆ రిస్క్ ఏమిటనుకుంటున్నారా.. తేనెటీగలు.  అవును తేనెటీగలు ఫామ్ పక్కనే బోయపాటి అండ్ కో చిత్రీకరణ చేస్తున్నారు.  ఏ చిన్న పొరపాటు జరిగినా తేనెటీగలు రేగి అందరినీ తీవ్రంగా గాయపరిచే ప్రమాదం ఉంది.  అందుకే టీమ్ మొత్తం ఎంతో జాగ్రత్తగా పనులు చేసుకుంటున్నారని ఉపాసన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.