మేనకోడలితో కలిసి మెగా పవర్ స్టార్ స్టెప్పులు...

మేనకోడలితో కలిసి మెగా పవర్ స్టార్ స్టెప్పులు...

కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ వాయిదా పడటంతో అందరూ హీరోలు అందరూ ఇంటికే  పరిమితం అయ్యారు . కాగా మళ్ళీ ఈ మధ్యే కొన్ని నియమాలను పాటిస్తూ షూటింగ్ జరుపుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో ఇప్పుడిపుడే మళ్ళీ సినిమా షూట్స్ ప్రారంభమవుతున్నాయి. ఇక కరోనా కారణంగా ఇంట్లోనే ఉన్న చాలా మంది హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. అయితే ఈ రోజు తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను పంచుకున్నాడు చరణ్. అందులో తన మేనకోడలు నవిష్క తో స్టెప్పులేశాడు. శ్రీజ కూతురు నవిష్కకు టీవీ చూపిస్తూ డాన్స్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో చరణ్ జుట్టు, గడ్డం పెంచి డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. దాంతో అందరూ ఈ లుక్ ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసమే అని అనుకుంటున్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు.