ప్లీజ్ నన్ను నిద్రపోనివ్వండి అంటోన్న చరణ్... 

ప్లీజ్ నన్ను నిద్రపోనివ్వండి అంటోన్న చరణ్... 

గ్యాప్ లేకుండా వరసగా షూటింగ్ లతో రామ్ చరణ్ బిజీ అయ్యారు.  ఈ ఏడాది జులై 30 వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఇందులో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్నారు.  రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం చరణ్ విపరీతంగా కష్టపడుతున్నారు.  అయితే, పండగను మాత్రం తన చరణ్ కుటుంబసభ్యుల మధ్య జరుపుకుంటున్నారు.  

అలసిపోవడం వలన చరణ్ తనను ఎవరూ డిస్ట్రబ్ చెయ్యొద్దని, నన్ను ప్రేమించే వ్యక్తులు తన నిద్రకు భంగం కలిగించకూడదు అనే మీనింగ్ తో వచ్చే టీ షర్ట్ ధరించారు చరణ్.  చరణ్ టీ షర్ట్ చూసిన ఫ్యామిలీ మెంబర్స్ నిజంగానే చరణ్ ను డిస్ట్రబ్ చేయడం లేదట.  ఇంకెందుకు ఆలస్యం పండగ రోజున హాయిగా నిద్రపోతే సరి.