వరుణ్ తేజ్ కోసం రామ్ చరణ్ తేజ్ !

వరుణ్ తేజ్ కోసం రామ్ చరణ్ తేజ్ !

వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి రూపొందించిన చిత్రం 'అంతరిక్షం'.  ఈ చిత్రం ఈనెల 21వ తేదీన రిలీజ్ కానుంది.  తొలి తెలుగు స్పేస్ సినిమా కాబట్టి ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఉంది.  ఈ క్రేజ్ ను మరింతగా పెంచేందుకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ను ముఖ్య అతిథిగా రానున్నారు.  రేపు 18న జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరగనుంది.  ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, అధితి రావ్ హైదరీలు కథానాయికలుగా నటించారు.