కరోనా నుంచి కోలుకున్న రాంచరణ్..

కరోనా నుంచి కోలుకున్న రాంచరణ్..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన రాంచరణ్ హోం క్వారంటైన్ పాటించాడు. అయితే నేడు మళ్లీ కరోనా పరిక్షలు చేయించుకోగా నెగిటివ్‌గా తేలింది. దీనిని రాంచరణ్ స్వయంగా షేర్ చేశాడు. ‘ఈ విషయం మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కరోనా నెగిటివ్‌గా నిర్ధరణ అయింది. మళ్లీ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నా’నని రాంచరణ్ రాసుకొచ్చాడు. అంతేకాకుండా తన గురించి ప్రార్థనలు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రస్తుతం రాంచరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తియిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో తాను పోషించనున్న కీలక పాత్ర కోసం సిద్దం కానున్నాడు. అయితే కరోనా నెగిటివ్‌గా తేలిన రాంచరణ్ తన సినిమా చిత్రీకరణలను ఎప్పుడు మొదలు పెడతాడని, తన సినిమాలపై కోత్త అప్‌డేట్‌లను ఎప్పుడు ఇస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.