స్టార్ హీరో రాంచరణ్‌కు కరోనా పాజిటివ్

స్టార్ హీరో రాంచరణ్‌కు కరోనా పాజిటివ్

యంగ్ హీరో రామ్ చరణ్ కరోనా బారిన పడ్డాడు. ఇటీవల అతడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా తన ట్విటర్ ద్వారా రాంచరణ్ వెల్లడించాడు. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా కొన్ని రోజుల క్రితమే కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆ అమ్మడు కూడా హో క్వారంటైన్ నిబందనలు పాటిస్తున్నాట్లు తెలిపింది. ఇప్పుడు రాంచరణ్‌కు పాజిటివ్ రావడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం హోం క్వారంటైన్ నిబందనలు పాటిస్తున్నాను. నా ఆరోగ్యంపై ఎప్పటికప్పడు అప్‌డేట్ ఇస్తుంటా’నని రాంచరణ్ తన ట్విటర్ ద్వరా వెల్లడించాడు. అంతేకాకుండా గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరాడు. ప్రస్తుతం రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దర్శకధీరుడు రాజమౌళి డైరక్షన్‌లో రూపొందుతోంది. వచ్చే ఏడాది జనవరీ11 నుంచి ఆచార్య సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నట్లు ఇటీవల సమాచారం వచ్చింది. అయితే ఇంతలో రాంచరణ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఇటీవల రాంచరణ్ ఆచార్య సెట్‌లోకి వెల్లి అందరిని కలిసి వచ్చాడు. దాంతో రాంచరణ్‌కు కరోనా ఆచార్య సెట్‌ నుంచి వచ్చిందా లేదంటే ఏమయిఉంటుందని అందరూ ఆలోచిస్తున్నారు. ఒకవేల ఆచార్య సెట్ నుంచి రాకపోతే రాంచరణ్ ఇటీవల వెల్లిన కారణంగా వారు కూడా పరిక్షలు చేయించుకోవాలి. మరి ఇకముందు కరోనా పాజిటివ్‌గా ఎందరికి తేలనుందో చూడాలి. ఈ వార్తతో హ్యాష్ ట్యాగ్ రాంచరణ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. అతడు త్వరలోనే కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.