మెగాస్టార్ 152 లో రామ్ చరణ్...?

మెగాస్టార్ 152 లో రామ్ చరణ్...?

మెగాస్టార్ చిరంజీవి సైరా పూర్తయింది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.  వచ్చే నెలలో చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22 వ తేదీన 152 వ సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతున్నది.  కొరటాల శివ దర్శకుడు. సమాజానికి ఉపయోగపడే సున్నితమైన కథాంశంతో సినిమా తెరకెక్కబోతున్నది.  ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది.  జబర్డస్ట్ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర కోసం తీసుకున్న సంగతి తెలిసిందే.  

ఇదిలా ఉంటె, ఈ సినిమాలో రామ్ చరణ్ అతిధి పాత్రలో కనిపిస్తున్నారని తెలుస్తోంది.  కొరటాల శివ అతిధి పాత్ర గురించి చరణ్ తో చర్చించారని, ఆ పాత్రలో నటించేందుకు చరణ్ కూడా ఒకే చెప్పారని సమాచారం.  గతంలో మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో మెగాస్టార్, చరణ్ లో స్క్రీన్ పై కనిపించారు.  ఇద్దరు కలిసి నటిస్తే ఇది నాలుగో సినిమా అవుతుంది. ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్న సంగతి తెలిసిందే.