చిరు 152లో చరణ్... ఆ పాత్రకోసమేనా?

చిరు 152లో చరణ్... ఆ పాత్రకోసమేనా?

మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది.  రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నారు.  99 రోజుల్లోగానే సినిమాను కంప్లీట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే.  సినిమా షూటింగ్ ఆలస్యం చెయ్యొద్దని ఇప్పటికే హుకుం జారీ చేశారు.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కనిపిస్తున్నారని తెలుస్తోంది.  

ఇందులో మెగాస్టార్ యంగ్ పాత్ర ఒకటి ఉన్నది.  ఆ పాత్ర కోసం రామ్ చరణ్ ను తీసుకుంటున్నారని సమాచారం.  అయితే, ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉన్నది.  సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.