రాజమౌళి ఎఫెక్ట్ : అమెరికాకు చరణ్

రాజమౌళి ఎఫెక్ట్ : అమెరికాకు చరణ్

ఏ ముహూర్తాన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా మొదలుపెట్టారో తెలియదుగాని.. పాపం వరసగా బ్రేకులు పడుతున్నాయి.  అనుకున్న సమయానికి ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు.  రామ్ చరణ్ కాలికి గాయం కారణంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే.. ఆ తరువాత ఎన్టీఆర్ చేయి గాయం కారణంగా కొంత ఆలస్యం అయ్యింది.  

రీసెంట్ గా హీరోయిన్ అలియా భట్ ప్రేగు ఇన్ఫెక్షన్స్ కారణంగా న్యూయార్క్ వెళ్ళింది ట్రీట్మెంట్ కోసం.  వచ్చిన తరువాత ఈ షూటింగ్ లో పాల్గొంటుంది.  ఎన్టీఆర్ కు హీరోయిన్ ఇంకా సెట్ కాలేదు.  ఇదిలా ఉంటె, రామ్ చరణ్ పై మరలా రాజమౌళి ఎఫెక్ట్ పడింది.  సినిమా విషయంలో రాజమౌళి ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో చెప్పక్కర్లేదు.  

రామ్ చరణ్ రెస్ట్ తీసుకొని తిరిగి సెట్స్ కు వచ్చే సరికి షేపులు కాస్త మారిపోయాయి.  దీంతో తిరిగి సినిమా షేపుల కోసం రామ్ చరణ్ ను రాజమౌళి అమెరికా పంపినట్టు తెలుస్తోంది.  అక్కడ జిమ్ ట్రైనర్ సమక్షంలో గతంలో మాదిరిగా షేపులు మార్చుకోబోతున్నాడు.