ఆచార్య షూటింగ్‌లో రాంచరణ్.. ఎప్పుడంటే..

ఆచార్య షూటింగ్‌లో రాంచరణ్.. ఎప్పుడంటే..

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మెగా ఫాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా ఇంకెప్పుడు పూర్తవుతుందని కొసరంత నిరాశ కూడా చూపుతున్నారు. ఈ సినిమా టైటిల్ విడుదలైనప్పటి నుంచి అభిమానుల్లో ఎదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటికే చాలా వరకు సినిమా చిత్రీకరణ పూర్తయిందట. నిజానికి లాక్‌డౌన్‌లోనే అత్యంత భారీ షెడ్యూల్ పూర్తి కావాల్సి ఉండగా పరిస్థితులు సహకరించక పూర్తి కాలేదట. అయితే ఈ సినిమాలో రాంచరణ్ కూడా కనిపించనున్నాడు. ఇందులో దాదాపు 40నిమిషాల నిడివి ఉన్న పాత్రలో రాంచరణ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం రాంచరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఆచార్యలో భాగస్వామ్యం అందుకుంటాడని వార్తలు వచ్చాయి. ఆచార్య  సినిమాలో రాంచరణ్ పరిచయాన్ని కొరటాల శివ ఎంతో ఎమోషనల్‌గా ప్లాన్ చేశాడట. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మొదట్లోనే అంటే జనవరీలోనే రాంచరణ్ ఆచార్య షూటింగ్‌లో పాల్గొననున్నాడట. అది కూడా జనవరీ11న తన చిత్రీకరణను మొదలు పెట్టనున్నారు. ఆచార్య సినిమాలో రాంచరణ్‌కు జోడీ కూడా ఉందని తెలిపారు. ఈ జోడీ హీరోయిన్‌ కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది. లక్కీ బ్యూటీ రష్మికా దాదాపు ఖరారు అయిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్త అధికారికంగా రానప్పటికీ తెగ వైరల్ అవుతుంది.