మెగా ఫ్రెండ్స్ తో చరణ్ సందడి... 

మెగా ఫ్రెండ్స్ తో చరణ్ సందడి... 

మెగాస్టార్ చిరంజీవితో 80లో కలిసి నటించిన స్టార్స్ కు మెగా ఆతిధ్యం ఇచ్చారు.  మెగాస్టార్ కొత్తగా కట్టుకున్న ఇంట్లో వీరికి ఆతిధ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ స్టార్స్ అందరు కలిసి డ్యాన్స్ తో హంగామా చేశారట.  పెద్ద వయసులో ఉన్నప్పటికీ వారిలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు.  అందరు సమానంగా డ్యాన్స్ చేస్తూ ఊర్రూతలూ ఊగించారు.  

జయప్రద,రాధ, సుమలత, నగ్మా ఇలా స్టార్స్ అందరు పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.  ఇక ఈ పార్టీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్టెప్పులతో అదరగొట్టాడు.  ఉదయం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఉన్నప్పటికీ.. స్టార్స్ తో కలిసి రాత్రి మొత్తం ఎంజాయ్ చేశారట. డ్యాన్స్ చేస్తూ సెల్ఫీలు దిగుతూ రచ్చ రచ్చ చేసినట్టు చరణ్ పేర్కొన్నారు.  ఇక ఆ స్టార్స్ మధ్యలో నిలబడి చరణ్ ఫోటోలు దిగారు.  ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.