రామ్‌ చరణ్‌కు కరోనా... ఉపాసన ఎమోషనల్‌ పోస్ట్‌ !

రామ్‌ చరణ్‌కు కరోనా... ఉపాసన ఎమోషనల్‌ పోస్ట్‌ !

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువ అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ భారీన పడ్డారు. ఈ వైరస్‌ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది కరోనా బారీన పడ్డారు.  తాజాగా... హీరో రామ్ చరణ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా తన ట్విటర్ ద్వారా రాంచరణ్ నిన్న వెల్లడించాడు. రామ్‌ చరణ్‌ కరోనా బారిన పడ్డ తర్వాత కొద్ది సేపటికే వరుణ్‌ తేజ్‌కు కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మెగా కోడలు, రామ్‌ చరణ్‌ వైఫ్‌ ఉపాసన కొణిదెల ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియా బాగా వైరల్‌ అవుతోంది. చరణకు పాజిటివ్‌ వచ్చిన తర్వాత తాను కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నానని... తనకు నెగిటివ్‌ వచ్చిందని పేర్కొంది ఉపాసన.  కానీ తనకు మళ్లీ పాజిటివ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా తెలిపింది. ప్రస్తుతానికి హోం క్వారంటైన్‌లో ఉన్నానని... వేడి నీరు, ఆవిరి పట్టడం, విశ్రాంతి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్వీట్‌ చేసింది ఉపాసన.