మరో బయోపిక్ ను ప్రకటించిన వర్మ

మరో బయోపిక్ ను ప్రకటించిన వర్మ

రామ్ గోపాల్ వర్మ... లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ముందు తన పరపతి తగ్గిపోతూ వచ్చింది.  సినిమా ఇండస్ట్రీలో వర్మ మరలా హిట్ కొడతాడా అనే డౌట్ క్రియేట్ అవుతున్న సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి వర్మ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు.  ఈ సినిమా రిలీజ్ తరువాత కోబ్రా మూవీని ప్రకటించాడు.  ఇందులో వర్మ ఓ పాత్రను చేస్తున్నాడు.  దానికి సంబంధించిన లుక్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.  

ఇదిలా ఉంటె,  ఈరోజు వర్మ మరో సంచలన బయోపిక్ ను ప్రకటించాడు.  కెసిఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వర్మ సినిమా చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించాడు.  దీనికి టైగర్ అని పేరు పెట్టారు.  అడు తెలంగాణ తెస్తనంటే అందరు నవ్విండ్రు అనే క్యాప్షన్ ఇచ్చాడు.  లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇచ్చిన కిక్ తో కెసిఆర్ బయోపిక్ స్టార్ట్ చేస్తున్నాడు వర్మ.  కెసిఆర్ పాత్రలో ఎవరు చేస్తున్నారు.  మిగతా క్రూ వివరాలు ఏంటి అన్నది త్వరలోనే ప్రకటిస్తారట.