కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. వర్మ సినిమా !

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. వర్మ సినిమా !

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పాలిటిక్స్ నేపథ్యంలో 'రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే చిత్రాలు చేసి సంచలనం సృష్టించారు.  ఆయన తన తదుపరి సినిమాల్ని కూడా అదే విధంగా తీయనున్నారట.  ఈసారి ఆయన తీయబోయే చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'.  పేరులోనే రెండు సామాజిక వర్గాల నడుమ జరిగే రాజకీయ పోరు అని సినిమా కథాంశాన్ని చెప్పేశారు వర్మ.

తాజాగా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఎన్టీఆర్ జీవితంలో చివరి దశలో ఎవరి వలన కష్టాల పాలయ్యారు, ఎలాంటి నరకయాతనను అనుభవించారో చెప్పడానికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేశాను.  సినిమాను విడుదల కానివ్వకుండా చేసి నన్ను విజయవాడలో అరెస్ట్ చేశారు.  సినిమా విడుదలకు ముందే బాబుకు శిక్ష పడింది అంటూ వ్యాఖ్యానించారు.