ప్రెస్ మీట్ పెడతా.. చంద్రబాబుకు వర్మ సవాల్ !

ప్రెస్ మీట్ పెడతా.. చంద్రబాబుకు వర్మ సవాల్ !

 

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వ్యవహారంలో టీడీపీ నేతలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మధ్య పెద్ద వివాదమే నడిచిన సంగతి తెలిసిందే.  ఈమధ్య విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి ట్రై చేసినప్పుడు కూడా వర్మను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపారు.  ఈ విషయాల్ని  బాగా గుర్తుపెట్టుకున్న వర్మ ఎక్కడైతే మాజీ సీఎం నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్ళగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నా.  బస్తీ మే సవాల్.  నిజమైన ఎన్టీఆర్ అభిమానులకు ఇదే నా ఆహ్వానం అంటూ ట్వీట్ చేసి చివర్లో జై జగన్ అంటూ స్లోగన్ కూడా పెట్టారు.  ఇకపోతే సినిమాను మే 31న  విడుదలచేయాలని నిర్ణయించారు.