ఎన్టీఆర్‌, అఖిల్‌పై ఆర్జీవీ సంచలన ట్వీట్‌..!

ఎన్టీఆర్‌, అఖిల్‌పై ఆర్జీవీ సంచలన ట్వీట్‌..!

కాంట్రవర్సీకి మారుపేరు అంటే గుర్తుకు వచ్చేది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసే సినిమాలు మాత్రమే కాకుండా పెట్టె ట్విట్లు కూడా అలానే ఉంటాయి. అంతేకాదు.. ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలలో ఉన్న ప్రముఖుల పైన సినిమాలు తీస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయనాయకులు, సినిమా హీరోలు, గ్యాంగ్‌స్టర్లు, ఫ్యాక్షనిస్టుల పైన సినిమాలు తీసాడు వర్మ. అయితే..ఎప్పుడూ వివాదాస్పద, వ్యంగ్య కామెంట్లతో వార్తల్లో నిలిచే వర్మ.. తాజాగా మరోసారి తనదైన శైలిలో జూనియర్‌ ఎన్టీఆర్‌, అఖిల్‌పై సంచలన ట్వీట్ చేశారు. ఒక ఈవెంట్‌లో ఎన్టీఆర్‌, అఖిల్‌ కలిసిన సందర్భంలో వాళ్లు సరదగా ముచ్చటించుకుంటున్న వీడియోను షేర్‌ చేసిన ఆర్జీవి ఇక హీరోయిన్ల భవిష్యత్తు కష్టల్లో పడినట్లే... అంటూ ఇండైరెక్ట్‌గా కౌంటర్‌ వేశారు. ఈ వీడియోలో తారక్‌ సరదాగా అఖిల్‌ తొడపై గిల్లడం.. చాలా చనువుగా వీళ్లు ఉండటం మనం గమనించవచ్చు. అయితే.. ఈ నేపథ్యంలో ఆర్జీవీ చేసిన ట్వీట్‌పై అటు నందమూరి, ఇటు అక్కినేని ఫాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "రెండు పెగ్గులు పడగానే.. ఏది పడితే అది మాట్లాడుతావు.. నీ గురించి మాకు తెలియదా " అంటూ ఆర్జీవీపై మండిపడుతున్నారు ఫ్యాన్స్‌. ఇక అంతకుముందు ట్వీట్‌లో నారా లోకేష్‌పై వర్మ సెటైర్‌ వేశారు. అమ్మాలను వదిలేసి.. సెల్ఫీలపై పడిపోయాడని ఎద్దేవా చేశారు. "అక్కడ తారక్‌, మరియు అఖిల్అక్కినేనిల ప్రేమకథ  అలా ఉంటే... ఇక్కడ నారా లోకేష్‌ అమ్మాయిలను వదిలేసి.. సెల్పీలపై పడిపోయాడు.. ఇది స్త్రీ జాతి ముగింపా " అంటూ మరో ట్వీట్‌ చేశాడు వర్మ.