రామ్ గోపాల్ వర్మ కూడా ఫిదా అయ్యాడు..

రామ్ గోపాల్ వర్మ కూడా ఫిదా అయ్యాడు..

బయోపిక్ లకు కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్న వర్మ వరసగా సెలెబ్రిటీల బయోపిక్ లు తీస్తూ దూసుకుపోతున్నాడు.  వర్మ సినిమా మొదలుపెడుతున్నాడు అంటే అది వార్తల్లో నిలవడం ఖాయం అనే విధంగా మారిపోతుంది.  వర్మ ప్రస్తుతం కెసిఆర్ బయోపిక్ తీస్తున్నాడు.  ఇది వేరే విషయం అనుకోండి.  

అసలు విషయానికి వస్తే... వర్మ గతంలో కిల్లర్ వీరప్పన్ పేరుతో వీరప్పన్ జీవితం గురించి సినిమా తీశాడు.  అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  కిల్లర్ వీరప్పన్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఆయన మీసాలు.  పొడవైన గుబురు మీసాలంటే ఆయనకు చాలా ఇష్టం.  ఈ మీసాలకు వర్మ కూడా ఫిదా అయ్యాడట.  వీరప్పన్ మీసాల స్పూర్తితో మెట్ గాలా హెయిర్ స్టైల్ ను డిజైన్ చేశారు.  వీరప్పన్ మీసాలు ఎలా ఉంటాయో ప్రియాంక చోప్రా హెయిర్ స్టైల్ అలా ఉంది.  దీంతో ట్విట్టర్ లో అందరు ఆమె హెయిర్ స్టైల్ ను వీరప్పన్ మీసాలతో పోల్చడంతో వర్మ థ్రిల్ అయ్యాడు.