మనసు మార్చుకున్న వర్మ !

మనసు మార్చుకున్న వర్మ !

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు, టీడీపీకి నడుమ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర వివాదం నడిచిన సంగతి  తెలిసిందే.  దీంతో ఇప్పటి వరకు ఏపీలో చిత్రం విడుదలకాలేదు.  కానీ తాజాగా ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఓడిపోయి, వైకాపా గెలవడంతో చిత్రాన్ని మే 31న విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు వర్మ.  అంతేకాదు ఈమేరకు గతంలో ఎక్కడైతే మాజీ సీఎం ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదో అదే విజయవాడలోని పైపుల రోడ్డులో మీటింగ్ పెడతానని ఛాలెంజ్ విసిరారు.  

కానీ విజయవాడ పోలీసులు మాత్రం నగరంలో ఎన్నికల కోడ్, 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, పైగా వర్మ వ్యతిరేక వర్గం అడ్డుకునే అవకాశం ఉందని, కాబట్టి సమావేశాన్ని రద్దీగా ఉండే పైపుల రోడ్డులో కాకుండా ఇంకేదైనా హాలులో పెట్టుకోవాలని సూచించారు.  దాంతో వర్మ సమావేశాన్ని గాంధీ నగర్ ఫిలిం ఛాంబర్లో సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.