పూరీ ట్వీట్‌కు వర్మ స్పందన...

పూరీ ట్వీట్‌కు వర్మ స్పందన...
క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ పేరు ప్రస్తావనపై తాను ఇప్పటికే సారీ చెప్పానని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారు. నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు బాధ పడటం బాధకల్గి స్తోందంటూ కొద్దిసేపటి క్రితం దర్శకుడు  పూరి జగన్నాథ్‌ చేసిన ట్వీట్‌కు వెంటనే వర్మ స్పందించారు. వర్మ చేసిన పని తనకు నచ్చలేదని,  ప్రాణం ఉన్నంత వరకు పవన్‌ కల్యాణ్‌ను సమర్థిస్తానని పూరి అన్నమాటలకు వర్మ స్పందిస్తూ... "నీ ఫీలింగ్స్ ను నేను అర్థం చేసుకోగలను. నేను చేసింది తప్పే. దానికి ఇప్పటికే తనకు నేను సారీ చెప్పాను" అని వర్మ సమాధానమిచ్చారు.