ఎన్టీఆర్ రివెంజ్ సాంగ్‌ను వదిలిన వర్మ !

ఎన్టీఆర్ రివెంజ్ సాంగ్‌ను వదిలిన వర్మ !

తెలుగుదేశం పార్టీ ఓటమిని ఎవరికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలీదు కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మాత్రం సూపర్ కిక్ ఇచ్చినట్టుంది.  నిన్న ఉదయం నుండి ట్విట్టర్ ద్వారా ఆయన చంద్రబాబు ఓటమిని తెగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.  లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో కొన్ని నెలలుగా టీడీపీకి, వర్మకు మధ్యన వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.  ఆ సినిమాను విడుదలకానివ్వలేదు కాబట్టే బాబును ఓడించానని ఎన్టీఆర్ తనకు కలలోకి వచ్చి చెప్పాడన్న వర్మ ఈరోజు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని విజయం అనే పాటను ది రివెంజ్ ఆఫ్ ఎన్టీఆర్ పేరుతో పోస్ట్ చేసి ఇది చంద్రబాబుపై వైఎస్ జగన్ విక్టరీ సాంగ్ అన్నారు.