‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై వర్మకు ఎదురుదెబ్బ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై వర్మకు ఎదురుదెబ్బ

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో సుప్రీంకోర్టులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు తక్షణ విచారణకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ అభ్యర్ధనను తిరస్కరించింది. ఏపీ హైకోర్టు ఏప్రిల్ 3వ తేదీ వరకు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ను విడుదల చేయరాదని ఆదేశించింది సుప్రీం కోర్టు. కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల నిలిపివేయడం వెనుక రాజకీయ అజెండా ఉందని ఆరోపించిన రాంగోపాల్ వర్మ... త్వరగా విచారించి సినిమా విడుదల అయ్యేలా చూడాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే, సుప్రీం కోర్టులో దీనిపై అంత త్వరగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.