ముఖానికి రంగేసుకున్న వర్మ.. ఆ పాత్రకోసమే... 

ముఖానికి రంగేసుకున్న వర్మ.. ఆ పాత్రకోసమే... 

రామ్ గోపాల్ వర్మ... సినిమా చేస్తున్నాడు అంటే.. ఆ సినిమా చుట్టూ వివాదాస్పదం అల్లుకుంటుంది.  వివాదాలతోనే సినిమా ముగుస్తుంది.  సినిమాలో కంటెంట్ ఉంటె ఆడుతుంది.  లేదు అనుకుంటే ఒకటి రెండు రోజులతో సినిమా థియేటర్స్ నుంచి బయటకు వెళ్తుంది.  బయటకు వెళ్ళినా, ఆడినా వర్మ పట్టించుకోడు.  తాను చెప్పాలి అనుకున్నది సినిమా ద్వారా చెప్తాడు అంతే.  

ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీస్తున్నాడు.  ఈ సినిమా టైటిల్ నుంచి వివాదంగా మారింది.  టైటిల్ వివాదంతో పాటు ట్రైలర్ కూడా అంతే హాట్ టాపిక్ అయ్యింది.  రాజకీయ నాయకులందరినీ ఈ సినిమాలో ఏకిపారేశారు.  విజయవాడ చుట్టూ జరిగే రాజకీయాలను ఈ సినిమాలో చూపించబోతున్నాడు.  అయితే, ఈ సినిమాలో వర్మ ఓ పాత్రకూడా చేసున్నాడు.  ఆ పాత్రకు సంబంధించిన ఓ ఫోటోను కూడా వర్మ రిలీజ్ చేయడం విశేషం.  అయితే, ఈ సినిమాలో డైరెక్టర్ పాత్రలో కనిపిస్తున్నాడా లేదంటే మరేదైనా పాత్రలో కనిపిస్తున్నాడా అన్నది సస్పెన్స్.