టిడిపి భవిష్యత్ జూనియర్ ఎన్టీఆర్ తోనే..!!

టిడిపి భవిష్యత్ జూనియర్ ఎన్టీఆర్ తోనే..!!

వర్మ ట్విట్టర్ లో తెలుగుదేశం పార్టీ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  లక్ష్మీస్ ఎన్టీఆర్ అనుకున్నదానికంటే మంచి విజయం సాధించడంతో వర్మ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.  అటు ఆంధ్రప్రదేశ్ లో సినిమా రిలీజ్ కాకపోవడంతో నిర్మాతలు హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  

ఇదిలా ఉంటె, ట్విట్టర్ వేదికగా చేసుకొని వర్మ తెలుగుదేశం పై కొన్ని కామెంట్లు చేశాడు.  టీడీపీకి అసలు వారసుడు నారా లోకేష్ కాదని, ఆ పార్టీ భవిష్యత్ జూనియర్ ఎన్టీఆర్ తోనే ఉంటుందని ట్వీట్ చేశాడు.  ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.  దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.