'మా నాన్న ఓ లెజెండ్‌.. ఆయనే నా బలం'

'మా నాన్న ఓ లెజెండ్‌.. ఆయనే నా బలం'

తన తండ్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు లెజెండ్‌ అని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఇవాళ ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆయన ట్వీట్‌ చేశారు. 
'తమ తండ్రి గొప్ప శక్తులున్న సూపర్‌ హీరో అని ప్రతి బిడ్డా అనుకుంటాడు. నేను కూడా వారిలో ఒకరినే. ఇంకా చెప్పాలంటే నాకు ఆయన సూపర్‌ హీరో కంటే ఎక్కువ. నాన్నే నా బలం. నాన్నే నాకు ప్రేరణ. నాన్నే నాకు స్ఫూర్తి. ప్రజలకు ఆయన రియల్‌ హీరో. ప్రజల హృదయాల్లో ఆయన చిరకాలం ఉండిపోతారు' అని ట్వీట్‌ చేశారు కింజరాపు రామ్మోహన్‌నాయుడు.