వడ్డీతో సహా ఇచ్చేస్తానంటున్న రామ్ !

వడ్డీతో సహా ఇచ్చేస్తానంటున్న రామ్ !

'నేను శైలజ' తర్వాత హీరో రామ్ కి ఆ స్థాయి హిట్ దొరకలేదు.  ఆయన చేసిన గత రెండు చిత్రాలు 'ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే' సినిమాలు ఆశించినంతగా ఆడలేదు.  ఈ విషయాన్ని రామ్ స్వయంగా ఒప్పుకున్నారు.

'హలో గురు ప్రేమ కోసమే' చిత్రం గురించి మాట్లాడుతూ సినిమా అన్నంతగా శాటిసిఫై చేయలేదు.  అయినా సినిమాను హిట్ చేశారు.  అందరికీ.. ముఖ్యంగా నా అభిమానులకి థ్యాంక్స్.  ఈసారి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను అన్నారు.   ఇకపోతే రామ్ తర్వాతి సినిమా వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది.