విలన్‌గా నేను రెడీ.. కానీ..
వైవీఎస్ చౌదరి రూపొందించిన 'దేవదాసు' సినిమాతో తెలుగు తెరకి హీరోగా పరిచయమైన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ సాఫీగా సాగుతోంది. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న రామ్.. మంచి మల్టీస్టారర్ సినిమాలో విలన్ రోల్ చేయడానికైనా రెడీయేనని చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో విలన్ పాత్రలకు భిన్నంగా ఉంటే నటించడానికి తనకేం అభ్యంతరం లేదని చెప్పాడు. కంటెంట్ బాగుండి.. పాత్ర భిన్నంగా ఉంటే విలన్ వేషం వేయడానికి సిద్ధమేనని చెప్పాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)