రెడ్ టీజర్ వచ్చేది ఎప్పుడో తెలుసా ..?

రెడ్ టీజర్ వచ్చేది ఎప్పుడో తెలుసా ..?

ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమా తరువాత రామ్ చేస్తున్న సినిమా రెడ్. అయితే ఈ సినిమా పై రామ్ అభిమానులకు భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే 40 కోట్ల తో బిగెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. అయితే అటువంటి సినిమా తరువాత రామ్ రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తరువాత సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి. అయితే తాజాగా చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేస్తూ సినిమా టీజర్ వచ్చేదెప్పుడో చెప్పేసింది. రెడ్ సినిమా టీజర్ ఈ నెల 28 న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే ఆ పోస్టర్ లో చెప్పకనే చెబుతున్నారు చిత్ర బృందం రామ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని అయితే అందులో ఒకరు దొంగ మరొకరు కాంట్రాక్టర్ అని సమాచారం. అయితే ఆ పోస్టర్ లో దొంగ మాస్ లుక్స్ తో కనిపిస్తుంటే కాంట్రాక్టర్ కళ్ళజోడు పెట్టుకొని కూడా సీరియస్ గా చూస్తున్నాడు. అయితే రామ్ కెరీర్ లో మొదటి సారిగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే చూడాలి మరి ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటుందో... లేదో.