రేపటి నుంచే రంజాన్...

రేపటి నుంచే రంజాన్...

ముస్లింలకు పవిత్రమైన పండగ రంజాన్. ఈ రోజు ఆకాశంలో నెలవంక కనిపించడంతో పవిత్ర రంజాన్ మాసానికి ఆహ్వానం పలికింది. దీంతో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే రంజాన్ మాస ఉపవాస దీక్షలు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. నెలవంక కనిపించిన తర్వాతి రోజు నుంచి రంజాన్‌ను ముస్లింలు జరుపుకుంటారు. రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్నట్లు రోయత్ హిలాల్ కమిటీ ప్రకటించింది. దీంతో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలకు సంసిద్దులయ్యారు.