వైట్ హౌస్ లో ట్రంప్ ఇఫ్తార్ విందు

వైట్ హౌస్ లో ట్రంప్ ఇఫ్తార్ విందు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పరిపాలన బృందంలోని ముస్లీం సభ్యులకు, వివిధ దేశాల ముస్లీం దౌత్యాధికారులకు సోమవారం వైట్ హౌస్ లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. రంజాన్‌ మాసం చాలా ప్రత్యేకమైన సమయమని, పొరుగు వారితో కలిసి ఆత్మీయతతో మెలిగే సమయం కూడా ఇదేనని అన్నారు. ఈ స్ఫూర్తితోనే తాము ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇటీవలి కాలంలో ముస్లింలు సహా ఇతర మతస్థులపై వివిధ దేశాల్లో జరిగిన దాడులను ట్రంప్‌ ఖండించారు. న్యూజిలాండ్‌లోని మసీదులో, శ్రీలంక, కాలిఫోర్నియా, పిట్స్‌బర్గ్‌ల్లో జరిగిన దాడులను గుర్తు చేశారు. ఉగ్రవాద మూలాలు, మతపరమైన హింసను నిర్మూలించినప్పుడే అన్ని వర్గాల వారు నిశ్చింతగా ఉండగలరని ట్రంప్‌ అభివర్ణించారు.