15న రంజాన్‌!

15న రంజాన్‌!

ఈనెల 15వ తేదీన రంజాన్‌ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఇంటర్నేషనల్‌ అస్ర్టానామికల్‌ సెంటర్‌ పేర్కొంది. రంజాన్‌ నెల చివరి రోజున... పండుగ ఎపుడు జరుపుకోవాలనేది యూఏఈలోని కమిటీ నిర్ణయిస్తుంది. సాధారణంగా గల్ఫ్ దేశాలు ఇదే తేదీని పాటిస్తాయి. షవ్వల్‌ నెల తొలి రోజున రంజాన్‌ పండుగ జరుపుకుంటారు. ఈనెల 14వ తేదీన చంద్రుడు కన్పించే అవకాశాలు ఉన్నాయని ఈ ఖగోళ సంస్థ పేర్కొంది. ఒకవేళ చంద్రుడు 14న కన్పించకపోతే కచ్చితంగా 16వ తేదీన పండుగ జరుపుకుంటారు. దీంతో గల్ఫ్ దేశల్లోని ప్రైవేట్‌ కంపెనీలు డైలమాలో పడ్డాయి. సాధారణంగా రంజాన్‌ సందర్భంగా ప్రభుత్వ సంస్థలకు మూడు  రోజులు, ప్రైవేట్‌ రంగ కంపెనీలు రెండు రోజులు సెలవు ప్రకటిస్తాయి. పండుగ  శనివారం వస్తే ప్రైవేట్‌ కంపెనీలు సోమవారం కూడా సెలవు ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో పండుగ ఎపుడొస్తుందనేది గల్ఫ్ ఉద్యోగులకు ఆసక్తిగా మారింది.